Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది.

మార్చినెలకు సంబంధించిన డబ్ల్యూపీఐ గణాంకాలను సోమవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రామాణిక వస్తువుల ద్రవ్యోల్బణం 2. 83గా ఉంది. ఆహారేతర ఫుడ్‌ ఇన్‌ఫ్లేషన్‌ 3.89గా ఉంది. అలాగే కూరగాయల నెలవారీ ప్రాతిపదికన 11శాతం పెరిగింది. మార్చి నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 28.13 శాతంగా నమోదైంది. కాగా అంతకు ముందు నెలలో ఇది 6.82 శాతంగా ఉంది.