Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఐసీసీ ప్రపంచకప్‌ కోసం అత్యంత పటిష్టమైన జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ వెళ్లబోయే భారత జట్టు సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు అత్యత్తుమ జట్టును ఎంపిక చేశారు. ఒకసారి ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాక భారత్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో ప్రపంచకప్‌ భారత జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా, రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దినేశ్‌ కార్తీక్‌ రెండో వికెట్‌ కీపర్‌గా చాన్స్‌ కొట్టేశాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతుంది. మరోవైపు ఈ సీజన్‌లో తమ జట్టు డిల్లీ క్యాపిటల్స్‌ ప్రదర్శన పట్ల ధావన్‌ హర్షం వ్యక్తం చేశాడు.