Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉదయం నిద్ర లేవగానే మనం చేసే పనుల ప్రభావం ఆ రోజంతా మనపైన ఉంటుంది. మన మూడ్‌ని అది నిర్ణయిస్తుంది. కాబట్టి ముందే ప్లాన్‌ చేసుకుంటే సరికొత్త ఉదయాల తో రోజు ఆహ్లాదంగా గడచిపోతుంది.
  • పొద్దున్నే మోగిన అలారం బటన్‌ నొక్కి, మళ్లీ ముసుగు తన్నే అలవాటు ఉంటే మానుకోవాలి. ఒకసారి మెలకువ వచ్చిన తరువాత మళ్లీ నిద్రపోవటం మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. కాబట్టి మీకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందనే విషయం ముందుగా తెలుసుకోని, దానికి తగ్గట్టు రాత్రి పక్కమీదకు చేరుకోవాలి.
  • నిద్రలేచినా పక్కమీదనే మునగదీసుకోని పడుకోవటం వల్ల లేచాక ఒత్తిడి పెరుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి.
  • పొద్దున లేవగానే కొంచెం సేపు రిలాక్స్‌ అవ్వండి. లేవగానే ఈ-మెయిళ్లు, మెసేజ్‌లు చెక్‌ చేయటాన్ని కొంచెంసేపు వాయిదా వేయండి.
  • రాత్రి కర్టెన్లు వేస్తే గదిలో చీకటి ఆవరించి, త్వరగా నిద్రలోకి జారుకుంటారు.
  • లేవగానే గ్రీన్‌టీ తాగటం, వ్యాయామం చేయటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి.
  •  ఉదయం 8 గంటల నుంచి 9 . గం. మధ్యలో శరీరం ఒత్తిడిని నిరోధించే కార్టిసాల్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ సమయంలో కాఫీ తాగితే కెఫిన్‌ శరీరంలోకి విడుదలవుతుంది. దీనివల్ల కార్టిసాల్‌ ఉత్పత్తిని తగ్గించటానికి శరీరం శ్రమించటం వల్ల అలసట కలుగుతుంది. ఉదయం 9:30 గంటల ప్రాంతం కాఫీ తాగటానికి అనువైనది.
  • ఉదయాన్నే పాస్తాలు, బ్రెడ్‌లు, దోసె, ఇడ్లీ వంటి టిఫిన్లు తినటం వల్ల పోషకాలు అందవు. దీనికి బదులు ప్రొటీన్లు, పీచు ఉండే ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను, అదుపు చేస్తుంది. కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.