Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో బరిలో దిగుతున్నారు.వీరందరినీ కలిపితే మోదీ ఈ సారి 50–60 మందితో తలపడాల్సి ఉంటుంది.బహుశా ఈ ఎన్నికల్లో అనేక మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా వారణాసి చరిత్ర సృష్టించినా ఆశ్చర్యం లేదు.

అయితే, గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే 42 మంది పోటీ చేశారు. వాటిలో ఒకటి మోదీ పోటీ చేసిన వారణాసి కాగా రెండోది తమిళనాడులోని దక్షిణ చెన్నై నియోజకవర్గం. ఆ ఎన్నికల్లో మోదీతో తలపడిన 41 మందిలో 40 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆప్‌ అభ్యర్థి కేజ్రీవాల్‌కు 2 లక్షల ఓట్లు వచ్చాయి. మోదీకి వచ్చిన 5.81 లక్షల ఓట్లలో ఇవి సగం కూడా లేవు. ఇక చెన్నై సౌత్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన జె.జయవర్ధన్‌ కూడా తనతో తలపడిన 41 మందిని ఓడించి 1.35 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ సారి కూడా ఆయన చెన్నై సౌత్‌నుంచే పోటీ చేస్తున్నారు.