Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వరుసగా మూడో మ్యాచ్‌.. ఇరు జట్ల ఆటతీరులోనే కాదు.. ఫలితంలోనూ మార్పులేదు.. బౌలర్లు విశేషంగా రాణిస్తూ కివీ్‌సను తక్కువ స్కోరుకే కట్టడి చేయడం, ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ ధాటిని కొనసాగించడాన్ని భారత్‌ మూడో వన్డేలోనూ పునరావృతం చేసింది. ఫలితంగా జట్టుకు హ్యాట్రిక్‌ విజయం. అంతేకా దు.. దశాబ్దకాలంగా జట్టును ఊరిస్తున్న వన్డే సిరీస్‌ అలవోకగా చేజిక్కించుకుంది. అలాగే 2014లో 0-4తో చిత్తుగా ఓడించిన కివీ్‌సపై ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్‌ శర్మ (77 బంతు ల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 62), విరాట్‌ కోహ్లీ (74 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) అర్ధ సెంచరీలతో చెలరేగిన వేళ ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో సిరీస్‌ దక్కించుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీ్‌సను షమి (3/41), పాండ్యా (2/45), భువనేశ్వర్‌ (2/46), చాహల్‌ (2/51) మూకుమ్మడిగా దెబ్బతీశారు. దీంతో ఆతిథ్య జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. రాస్‌ టేలర్‌ (106 బంతుల్లో 9 ఫోర్లతో 93) పోరాటానికి టామ్‌ లాథమ్‌ (64 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 51) ఒక్కడే సహకారం అందించాడు. ఆ తర్వాత ఓ మాదిరి లక్ష్యాన్ని భారత్‌ 43 ఓవర్లలో 3 వికెట్లకు 245 రన్స్‌తో ఛేదించింది. అంబటి రాయుడు (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 నాటౌట్‌), దినేశ్‌ కార్తీక్‌ (38 బంతుల్లో 5 ఫో ర్లు, 1 సిక్స్‌తో 38 నాటౌట్‌) వేగంగా ఆడారు. బౌల్ట్‌ రెండు వికెట్లు తీశాడు. షమికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

శతక భాగస్వామ్యం: 244 పరుగుల ఓ మాదిరి లక్ష్యఛేదనను భారత్‌ ధాటిగానే ఆరంభించింది. రోహిత్‌ నిదానం కనబరిచినా ధవన్‌ (28) దూకుడుగా ఆడాడు. రెండో ఓవర్‌లోనే అతడు హ్యాట్రిక్‌ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత మరో మూడు ఫోర్లు బాదినా తొమ్మిదో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అనంతరం రోహిత్‌, కోహ్లీ జోడీ ఆరంభంలో ఆచితూచి ఆడినా.. కుదురుకున్నాక బౌండరీలతో సత్తా చూపింది. రెండు సిక్సర్లు కూడా బాది న రోహిత్‌ 63 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లీ 59 బంతుల్లో కెరీర్‌లో 49వ అర్ధసెంచరీ సాధించాడు. సమయోచితంగా ఆడుతున్న ఈ జోడీని శాంట్నర్‌ విడదీశాడు. 29వ ఓవర్‌లో రోహిత్‌ స్టంపౌట్‌ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు ఓవర్ల తర్వాత కోహ్లీ కూడా వెనుదిరిగినా, రాయుడు వచ్చీ రాగానే బౌండరీలతో వేగం కనబరిచాడు. అతడికి జతగా దినేశ్‌ కార్తీక్‌ కూడా పోటీపడి ఆడడంతో లక్ష్యం మరీ సునాయా సమైంది. నాలుగో వికెట్‌కు వీరు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం అందించడంతో జట్టు మరో 42 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

అదే తడబాటు: మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఎప్పటిలాగే తడబడింది. పేసర్లు షమి, భువనేశ్వర్‌ బౌలింగ్‌కు 59 పరుగులకే గప్టిల్‌ (13), మన్రో (7), విలియమ్సన్‌ (28) వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఈ దశలో టేలర్‌, లాథమ్‌ నాలుగో వికెట్‌కు 119 రన్స్‌ జత చేసి భారీ స్కో రుపై ఆశలు రేపారు. కానీ లాథమ్‌ వికెట్‌ తీసి చాహల్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడినా టేలర్‌ ధాటిని కొనసాగించాడు. అయితే శతకం వైపు సాగుతున్న అతడిని షమి బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు.