Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సాధారణంగా సగ్గుబియ్యంతో చేసిన పాయసం అంటే చాలా మంది ఇష్టపడతారు. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువుగా ఉంటాయి. ఫ్యాట్స్ తక్కువుగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు ఇది చక్కని పోషకాహారం. దీనిలో స్టార్చ్ శాతం ఎక్కువుగా ఉంటుంది. సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. అవి ఏమిటంటే……..

1. కండరాల పెరుగుదలకి సగ్గుబియ్యం చాలా ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి.

వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

2. సగ్గుబియ్యంలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.ఇది మెదడు చురుకుగా ఉండటానికి ఎంతగానో దోహదపడుతుంది. సగ్గుబియ్యంను పాయసంలా చేసుకొని తరచూ తినడం వలన ఒంట్లో ఉన్న వేడి వెంటనే తగ్గిపోతుంది. శరీరానికి తక్షణమే శక్తి వస్తుంది.

3. సగ్గుబియ్యం మంచిగా జీర్ణం అయ్యే ఆహారం.అదే విధంగా ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారు కూడా సగ్గుబియ్యంను తీసుకోవచ్చు. సగ్గు బియ్యంను పాల లేదా నీటితో ఉడికించి తర్వాత పంచదార మిక్స్ చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ మాయం అవుతాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని అందిస్తుంది.

4. సగ్గు బియ్యం ఎక్కువ శక్తిని అందిస్తుంది. అప్పుడు అప్పుడు దీన్ని ఉదయం టిఫిన్ గా తీసుకోవడం మంచిది. చాలా సన్నగా ఉన్న వారికి, దీని వల్ల ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. మరీ సన్నగా, బలహీనంగా ఉన్నవారు సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల, ఇది ఎక్కవ శక్తిని అందిస్తుంది. మరియు బలహీనతను పోగొడుతుంది.