Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలయ్య అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలయ్యగా మారింది బాలయ్య చిత్రాలు విడుదలవుతున్న విధానం చూస్తుంటే. సంక్రాంతికి తప్పనిసరిగా మూవీ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి రాబోయే సంక్రాంతికి రెడీ కాబోతున్నాడు. ఈసారి రాబోయే చిత్రం అలాంటిలాంటి చిత్రం కాదు. లెజెండ్, మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంతో సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు బాలయ్య.
‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా’ వంటి చిత్రాలతో సంక్రాంతి హీరోగా పేరుని లిఖించుకున్న బాలయ్య.. సెంటిమెంట్‌ని వదలకుండా.. రాబోయే సంక్రాంతి బరిలో కూడా దిగాలని ప్లాన్ చేస్తున్నాడట. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటిలతో కలిసి తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మించబోతున్న ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. ఈలోపు ఆర్టిస్టులను, టెక్నిషీయన్స్‌ని ఎంపిక చేసి ఏకథాటిగా షూటింగ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని ఇప్పటికే తేజకి కూడా బాలయ్య గట్టిగా చెప్పేశాడట. బాలయ్య చెప్పాడంటే ఇంక దానికి తిరుగులేనట్లే. ఎమ్. ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.