Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సెన్సెక్స్‌ 284 పాయింట్లు అప్‌.. నిఫ్టీ రికార్డు ముగింపు
ముంబై: వారంలో ఎక్కువ రోజులు నష్టాలు నమోదు చేసి ఇన్వెస్టర్లను, స్టాక్‌ మార్కెట్‌ పండితులను ఆందోళనకు గురి చేసిన బుల్‌ వారాంతం రోజున సంకెళ్లు తెంచుకుని పరుగులు పెట్టింది. వారం మొత్తంలో ఏర్పడిన నష్టాలన్నింటినీ పూడ్చుకుని చారిత్రక గరిష్ఠ స్థాయిలకు సమీపంగా ఇండెక్స్‌లు దూసుకుపోయేందుకు దోహదపడింది. నిఫ్టీ అయితే మరో చారిత్రక గరిష్ఠ స్థాయిలో ముగిసింది. అమెరికా, చైనా వాణిజ్య చర్చలు పునరుద్ధరించుకోనున్నట్టు వెలువడిన సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. దీనికి తోడు వారం రోజుల కరెక్షన్‌లో ఆకర్షణీయంగా అందుబాటులోకి వచ్చిన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలు పరుగులు తీయడం కూడా మార్కెట్‌ను లాభాల బాటలో నడిచేందుకు దోహదపడింది.

ఎఫ్‌ఎంసిజి, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లకు భారీ మద్దతు లభించింది. ఇంట్రాడేలో 38022.32 పాయింట్ల డే గరిష్ఠ స్థాయిని చేరింది. ఆగస్టు పదో తేదీ న నమోదు చేసిన జీవితకాల గరిష్ఠ స్థాయికన్నా ఇది స్వల్ప దూరం మాత్రమే. చివరికి 284.32 పాయింట్ల లాభంతో 37947.88 పాయింట్ల వద్ద క్లోజయింది. నిఫ్టీ కూడా 85.70 పాయింట్లు లాభపడి కొత్త రికార్డు స్థాయి 11470.75 పాయిం ట్ల వద్ద క్లోజయింది. ఆయిల్‌, గ్యాస్‌ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ముగిశాయి. ఇండెక్స్‌లు లాభాల్లో ముగియడం వరుసగా ఇది నాలుగో వారం. ఈ వారంలో సెన్సెక్స్‌ 78.65 పాయింట్లు, నిఫ్టీ 41.25 పాయింట్లు లాభపడ్డాయి.
స్టాక్‌ ఎక్స్ఛేంజిల వద్ద ఉన్న సమాచారం ప్రకారం గురువారం దేశీయ సంస్థలు 133.78 కోట్ల రూపాయల విలువ గల షేర్లను కొనుగోలు చేయగా ఎఫ్‌పిఐలు 825.08 కోట్ల రూపాయల విలువ గల ఈక్విటీలను విక్రయించాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన షేర్లలో 3.76 శాతం లాభపడిన యస్‌ బ్యాంక్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌బిఐ, వేదాంత, హెచ్‌యుఎల్‌, టాటా మోటార్స్‌, ఐటిసి, టాటా స్టీల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, కక ఓటక్‌ బ్యాంక్‌, మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా, ఎల్‌ అండ్‌ టి, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, టిసిఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌ ఉన్నాయి. ఈ షేర్లు సగటున 3.76 శాతం లాభపడ్డాయి.

పిఇ పెట్టుబడులు 1151 కోట్ల డాలర్లు
గత జనవరి-జూలై మధ్యకాలంలో 1,151 కోట్ల డాలర్ల పిఇ పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. గత ఏడాది మొదటి ఏడు నెలల్లో వచ్చిన పిఇ పెట్టుబడులకన్నా ఇది 20 శాతం అధికం. ప్రధానంగా జూలైలో 210 కోట్ల డాలర్ల పిఇ పెట్టుబడులురావడం, అందులోనూ అధికంగా పెద్ద డీల్స్‌ ఉండడం గుర్తించాల్సిన అంశమని గ్రాంట్‌ థార్న్‌టన్‌ తాజా నివేదికలో తెలిపింది. గత జూలైతో పోల్చితే పిఇ పెట్టుబడుల్లో సంఖ్యాపరంగా 37 శాతం, విలువపరంగా 72 శాతం వృద్ధి ఏర్పడిందని గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి డైరెక్టర్‌ పంకజ్‌ చోప్రా అన్నారు. విదేశీ సంస్థల కొనుగోళ్లకు ఈ భారీ డీల్స్‌ కలిసి వచ్చాయని ఆయన అన్నారు.

జూలై నెలలో ప్రధానంగా స్టార్ట్‌పలు, రియల్‌ ఎస్టేట్‌, ఇ-కామర్స్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, బయోటెక్‌ రంగాలు అధిక మొత్తంలో పిఇ పెట్టుబడులను ఆకర్షించాయని చెప్పా రు. రానున్న కాలంలో కూడా ఇంతే జోరుగా పిఇ పెట్టుబడులు రావచ్చునని ఆయన అంచనా వేశారు. అధిక లాభాలు ఆర్జించి పెట్టే రంగాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారని ఆయన అన్నారు. స్టార్ట ప్‌లు అధికంగా 57 శాతం పెట్టుబడులను ఆకర్షించగా ఫిన్‌టెక్‌, డేటా అనాలిసిస్‌, ఎఐ విభాగాల్లో ఒక్కో విభాగంలో ఆరేసి డీల్స్‌ కుదిరినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అరిస్టా లైఫ్‌ సైన్సెస్‌ కొనుగోలుకు యుపిఎల్‌ తీసుకున్న 120 కోట్ల డాలర్ల పెట్టుబడి ఈ ఏడాది ఇంతవరకు కుదిరిన అతిపెద్ద డీల్‌.

ఆస్ర్టాజెనెకా 11 శాతం అప్‌
ఓవరీలు, బ్రెస్ట్‌ కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే ఓలాపరిబ్‌ టాబ్లెట్లు దిగుమతి చేసుకుని మార్కెటింగ్‌ చేసేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి లభించడంతో ఆస్ర్టా జెనెకా షేరు 11 శాతం పెరిగింది. బిఎ్‌సఇలో ఈ షేరు 7.63 శాతం పెరిగి 1840.75 రూపాయల వద్ద క్లోజ్‌ కాగా ఎన్‌ఎ్‌సఇలో 10.74 శాతం పెరిగి 1894 రూపాయల వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిలో ముగిసింది. ఆస్ర్టా జెనెకా గ్రూప్‌ పేటెంటెడ్‌ ఔషధం అయిన ఓలాపరిబ్‌ టాబ్లెట్లు 100 ఎంజి, 150 ఎంజి డోసేజిల్లో దిగుమతి చేసుకుని మార్కెటింగ్‌ చేసేందుకు తమకు అనుమతి లభించినట్టు కంపెనీ బిఎ్‌సఇకి తెలిపింది.