Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. అందులోనూ ప్రత్యేకించి శివలింగం గురించి చెప్పాలంటే ‘లీనమర్థం గమయతీతి లింగః’ అని అంటారు. అంటే సృష్టంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం. అంతటి శక్తివంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం. నర్మదా బాణలింగాల వంటివీ ఇంటిలో ఉంచుకోవచ్చు. నిత్యపూజకు లోపం రానీయకూడదు. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు.