Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లాన్స్‌డౌన్‌…
ఢిల్లీ నుంచి కేవలం 260కిమీ దూరాన ఉన్న లాన్స్‌డౌన్‌ను చేరుకోవడానికి 6-7 గంటల ప్రయాణం చేయాలి. ఇక్కడ బస చేయడానికి ఖరీదైన హోటల్లు రిసార్టులు ఉండవు. మన బడ్జెట్‌లోనే ఇంటి వాతవరణాన్ని తలపించే వసతి లభిస్తుంది. ట్రెక్కింగ్‌ ఆసక్తి ఉన్న వారికి సరిగ్గ సరిపోయే ప్రదేశం లాన్సడౌన్‌. హిమాలాయాలను సందర్శించడానకి ప్రసిద్ధికెక్కిన టిపి టాప్‌ పాయింట్లకు నెలవు ఈ ప్రదేశం. ఇవే కాక భీమ్‌ పకోర, తారకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం, భుల్ల తాల్‌ ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు.

కసౌలి…
ఢిల్లీ నుంచి సుమారు 290కి.మీ. దూరాన హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి  అయిదారు గంటల సమయం పడుతుంది. సిమ్లాకు సమీపాన ఉన్న కసౌలి చల్లని ప్రాంతమే కాక హిమాచల్‌లో ఉన్న మిగితా వేసవి విడిది ప్రాంతాల కన్నా చాలా అందమైన ప్రదేశం. నేటికి చెక్కుచెదరకుండా ఉన్న కాలనీల నిర్మాణాలు అలనాటి నిర్మాణ కౌశాలనికి నిదర్శనం. గ్రామీణ వాతావరణాన్ని, అనేక ఆలయాలను, అందమైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. ప్రసిద్ధ మోహన్‌ మెయ్కిన్‌ బ్రేవరీ ఇక్కడే ఉంది.

ముస్సోరి…
ఢిల్లీకి 285 కి.మీ. దూరాన ఉన్న ముస్సోరిని చేరుకోవడానికి ఏడు గంటల సమయం పడుతుంది. అత్యంత రద్దీగా ఉండే ముస్సోరిని చేరుకోవడానికి రోడ్డు మార్గం కన్నా శివారు ప్రాంతాల గుండా వెళ్తే ముస్సోరి అసలు సౌందర్యం కనిపిస్తుంది. భోజన ప్రియులకు స్వర్గధామం ఈ ప్రాంతం. రెస్టారెంట్లు, కేఫేలు కొకొల్లలుగా ఉంటాయి. ఇక్కడ స్థానిక హిమాలయ ప్రాంత ఆహారమే కాకుండా యూరోపియన్‌ ఆహారం కూడా లభిస్తుంది. రస్కిన్‌ బాండ్‌ ప్రముఖ పుస్తకాల దుకాణం ఇక్కడే ఉంది.

నౌకుచైతాల్‌…
ఢిల్లీకి 320కి.మీ. దూరాన ఉన్న నౌకుచైతాల్‌ ప్రాంతాన్ని చేరుకోవడానికి సుమారు ఏడు గంటల ప్రయాణం చేయాలి. నైనితాల్‌ – భీమ్‌తాల్‌కు సమీపాన ఉండటంతో ఈ ప్రాంతానికి యాత్రికుల రద్దీ తక్కువ. జనావాసాలకు దూరంగా, ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇ​క్కడ ప్రధాన ఆకర్షణ నౌకుచైతాల్‌ సరస్సు. చుట్టూ కొండలతో ఉండే ఈ సరసుకు తొమ్మిది మూలలు ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతానికి నౌకుచైతాల్‌ అనే పేరు వచ్చింది. సాహసాలు ఇష్టపడే వారికి ట్రెక్కింగ్‌తో పాటు పారాగ్లైడింగ్‌, పారాసెయిలింగ్‌ చేయడానకి కూడా అవకాశం ఉంటుంది.