Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చలికాలంలో చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా బ్యూటీకి సంబంధించి మహిళలు చికాకు పడకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు డైటీషియన్స్‌, కాస్మొటిక్‌ ఫిజీషియన్స్‌.
  •  బెస్ట్‌ స్కిన్‌ డైట్‌ ఏమిటంటే… ఆహారంలో తప్పకుండా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒకసారైనా ఏదో ఒక జ్యూస్‌ తాగాలి.
  • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని బలోపేతం చేస్తాయి. సోయాబీన్స్‌, వాల్‌నట్స్‌లలో ఇది అధికంగా లభిస్తుంది.
  • విటమిన్‌ సి లభించే స్ట్రాబెర్రీస్‌, నిమ్మజాతి పళ్లు, బ్రొకోలి వంటివి తీసుకోవాలి.
  •  యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే విటమిన్‌ ఏ, ఇ కోసం చిలకడదుంప, క్యారెట్లను విరివిగా వాడాలి.
  •  వీటితో పాటు ఆలోవెరా జ్యూస్‌, గోధుమ గడ్డి, దానిమ్మ, నీళ్లు తాగడం వల్ల కూడా చర్మం మృదువుగా ఉంటుంది.
  •  రెగ్యులర్‌ ఫేస్‌వాస్‌లు, క్లిన్సర్లు కాకుండా, సల్ఫేట్స్‌ లేని నాన్‌ ఫోమింగ్‌ క్లిన్సర్లు వాడాలి.
  •  వేసవి కన్నా చలికాలంలోనే సూర్య కిరణాలు తీక్షణంగా ఉంటాయి కాబట్టి కనీసం 30 ఎస్‌పిఎఫ్‌, యువిఎ రక్షణ ఉన్న సన్‌స్ర్కీన్‌ లోషన్లను చర్మానికి రాసుకుంటే నల్లబడకుండా ఉంటుంది.