Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మహారాష్ట్ర ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసిన 9 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశిస్తే వారిని మట్టుబెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పష్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను భగ్నం చేసేందుకు వారు గంగా జలాలను విషపూరితం చేయాలని కుట్ర పన్నారనే అనుమానాల నేపథ్యం‍లో యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐసిస్‌ ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన మహారాష్ట్ర ఏటీఎస్‌ బృందాన్ని ఆయన అభినందిస్తూ వీరు యూపీలో ప్రవేశిస్తూ తక్షణమే అంతమొందిస్తామన్నారు. ముంబైలో శుక్రవారం జరిగిన 31వ యూపీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు.

కుంభమేళాలో విధ్వంసానికి కుట్ర పన్నిన ఐసిస్‌ ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడం ద్వారా మీరు చాకచక్యంగా వ్యవహరించారని ఈ కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి యూపీ సీఎం అభినందించారు. ఐసిస్‌ ఉగ్రవాదులు యూపీలో ప్రవేశిస్తే వారిని తమ రాష్ట్ర సరిహద్దులోనే మట్టుబెడతామని స్పష్టం చేశారు. అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు.