Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావలసినవి:
నిమ్మరసం, మంచి నీళ్లు – ఒక్కో కప్పు చొప్పున, పంచదార – అర కిలో, కుంకుమపువ్వు – అర టీస్పూన్‌ (ఇష్టపడితేనే), ఆకుపచ్చ యాలక్కాయల పొడి – ఒక టీస్పూన్‌.
తయారీ:
  • సాస్‌ పాన్‌లో కప్పు నీళ్లు పోసి, పంచదార వేయాలి. పాన్‌ను సన్నటి మంట మీద పెట్టి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ పంచదార మిశ్రమాన్ని వేడిచేయాలి.
  • పంచదార పూర్తిగా కరిగాక మిశ్రమం పట్టుకుంటే చేతి వేళ్లకు అతుక్కుంటుంది. అప్పుడు స్టవ్‌ ఆపేయాలి.
  • వేడివేడి పంచదార నీళ్లను ఒక గిన్నెకు పలుచని బట్ట కట్టి వడకట్టాలి. గోరు వెచ్చగా లేదా గది ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు అలానే ఉంచాలి.
  • తరువాత అందులో నిమ్మరసాన్ని కలిపి, యాలక్కాయల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలియబెడితే లెమన్‌ స్క్వాష్‌ రెడీ.
  • దీన్ని శుభ్రమైన గాజు సీసాలో పోసి గట్టిగా మూత బిగించి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి.
  • ఎప్పుడు లెమన్‌ స్క్వాష్‌ తాగాలనిపిస్తే అప్పుడు తయారుచేసుకుని తాగేయొచ్చు. అదెలాగంటే నాలుగు టేబుల్‌ స్పూన్ల లెమన్‌ స్క్వాష్‌ను ఒక గ్లాసులో తీసుకుని, నీళ్లు పోసి, ఇందులో ఐస్‌ క్యూబ్‌లు కలుపుకోవచ్చు లేదా చల్లటి నీళ్లు కలిపైనా తాగేయొచ్చు.