Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధకులు తేల్చారు. రోజుకు ఎక్కువ సార్లు కాఫీ తాగే వారి గుండె ధమనుల్లో కాల్షియం నిల్వలు తక్కువగా పేరుకుపోయినట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సాపౌలో చేపట్టిన తాజా అథ్యయనంలో వెల్లడైంది. రోజుకు మూడు కప్పులు పైగా కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా పేరుకుపోయినట్టు తమ పరిశోధనలో గుర్తించామని అథ్యయన రచయిత ఆండ్రియా మిరండా వెల్లడించారు.

రోజుకు మూడు సార్లు కన్నా కాఫీ తాగితే ఇంకా మేలని..అయితే అతిగా తాగడం మాత్రం అనారోగ్యకరమని చెప్పారు. కాఫీలో ఉండే కేఫిన్‌ లేక ఇతర యాంటీఆక్సిడెంట్స్‌ వేటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మాత్రం పరిశోధన స్పష్టత ఇవ్వలేదు. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది.