Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వాతావరణంలో మార్పుల వల్ల చాలామంది అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. అకస్మాత్తుగా ఏర్పడే వాతావరణ మార్పులకు కొన్నిసార్లు శరీరం సిద్ధంగా లేకపోవడం, ఆ సమయంలో పరాన్నజీవులు శరీరంపై దాడి చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, తద్వారా వ్యాధులకు గురికావడం జరుగుతుంది. అధిక మానసిక ఒత్తిడి వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ అసమతుల్యతకు గురవుతుంది. కనుక రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూన్‌ సిస్టమ్‌) ఏ విధంగా పనిచేస్తుంది? హోమియో వైద్య విధానంలో ఇది ఏ విధంగా బలాన్ని పొందుతుందో తెలుసుకోవడం అవసరం.
 రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలోని వివిధ అవయవాలు, వాటి ప్రక్రియల సమ్మేళనం. ఇది వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ వంటి వాటి నుంచి శరీరానికి సహజంగా రక్షణ కల్పించే కీలక వ్యవస్థ. ఇది కొంత వరకు వారసత్వంగా ఏర్పడితే… మరికొంత మన జీవన శైలి వల్ల వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ప్రతి కణంలో ఉంటుంది. ఈ వ్యవస్థలో చర్మం కింది భాగం, బోన్‌ మ్యారో, లింఫ్‌ గ్రంథులు, రక్తం, ప్లీహం వంటివన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి.
 సాధారణంగా శరీరంలో చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు మనతో సహజీవనం సాగిస్తాయి. ఏ కారణంతోనైనా ఈ వ్యవస్థ అసమతుల్యతకు గురైతే అవి (బ్యాక్టీరియా వంటివి) శరీరంపై దాడి చేసి, వ్యాధులను కలిగిస్తాయి. ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని స్వయంగా సరిచేసుకునే ప్రక్రియ కారణంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ ఏర్పడుతుంది. ఉదాహరణకు జలుబు, టాన్సిలైటిస్‌ వంటివి.
సరైన పోషకాహారం ఆరోగ్యానికి ఎంతో అవసరమన్న సంగతి తెలిసిందే. అలాగే నిద్ర, విశ్రావంతి, ఉద్యోగం, వ్యాయామం, నీళ్లు వంటివి ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ అవి శరీరానికి అవసరమైన మోతాదులో అందినప్పుడే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల స్థూలకాయం, తక్కువ తీసుకుంటే పోషకాహార లోపం వస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉత్తేజితంగా ఉంటే అది కొన్ని రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధుల (ఉదా: రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, సొరియాసిస్‌)కు దారితీస్తుంది.
ఇతర వైద్య విధానాల్లో వ్యాధి లక్షణాలను మాత్రమే తగ్గించడం వల్ల వ్యాధి పూర్తిగా అణిచివేయబడి, వ్యాధి మూలాలు శరీరంలో అలాగే ఉండిపోతాయు. తద్వారా వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఆ మూలాలను సైతం శరీరం నుంచి పూర్తిగా తొలగించాలంటే ప్రకృతిసిద్ధమైన విధానాన్ని పాటించాలి. అలాంటి వాటిలో హోమియోపతి ఒకటి. ఇది ప్రకృతిసిద్ధమైన ‘లా ఆఫ్‌ సిమిలర్స్‌’ సిద్ధాంతంపై పనిచేస్తుంది. వ్యాధిని నివారరించే ఔషధాలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులపై ఉపయోగించినప్పుడు, అవి ఆ వ్యాధి లక్షణాలను కనబరుస్తాయి. దీన్నే ‘లా ఆఫ్‌ సిమిలర్స్‌’ అంటారు. ఈ ఔషధాలను తక్కువ మోతాదులో ఆల్కహాల్‌ ద్రావకంలో గానీ, నీటిలో గానీ విలీనపరిచి ఎక్కువసార్లు కుదించడం ద్వారా దాని ప్రాణాధార శక్తి అయిన వైటల్‌ ఫోర్స్‌ పెరిగి, అవి అసమతుల్యలతలకు గురవాతాయి. తద్వారా రోగనిరోధక శక్తికి బలం చేకూరుతుంది. ఇలా బలాన్ని పొందిన రోగనిరోధక వ్యవస్థ తనంతట తానుగా వ్యాధిని సమూలంగా నిర్మూలించగలుగుతుంది. తద్వారా వ్యాధి తిరగబెట్టకుండా, ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. హోమియోపతి వైద్య విధానంలో వ్యాధికి మాత్రమే కాకుండా… రోగికి సరైన చికిత్స అందించడం జరుగుతుంది. ఇది ఆ రోగిని ‘లా ఆఫ్‌ ఇండివిడ్యువలైజేషన్‌’ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఏ ఇద్దరి ప్రవర్తనా ఒకేలా ఉండదు. అలాగే అనారోగ్యంబారిన పడిన వారిలో కూడా ఒక్కోరికీ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. వీటిని గుర్తించడాన్నే ‘లా ఆఫ్‌ ఇండివిడ్యువలైజేషన్‌’ అంటారు. దీని ద్వారా వ్యాధి మూలాలపై సమగ్ర అధ్యయనం చేసి, ఆ వ్యక్తికి సరిపడిన ఔషధం అందించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడం జరుగుతుంది.
 హోమియేకేర్‌ ఇంటర్నేషనల్‌లో చికిత్స: హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించే అధునాతన జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ చికిత్సా విధానం ద్వారా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే రోగి సమస్యపై అధ్యయనం చేస్తాం. తద్వారా వ్యాధి మూలాలను గుర్తించిన అనంతరం చికిత్స అందిచడం జరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్‌, కీళ్లు, హార్మోన్‌, సంతాన లేమి, థైరాయిడ్‌, చర్మ సమస్యల వంటి వాటిని నియంత్రణలో ఉంచడం జరుగుతుంది.