Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే టర్కీ చూసేయండి. దక్షిణాఫ్రికా చుట్టేసిరండి. ఆ దేశాలకే ఎందుకు వెళ్లాలంటారా! ఆ దేశ కరెన్సీ పతనం అవ్వడమే అసలు కారణం. డాలర్‌ ముందు తేలిపోతున్న రూపాయి.. కొన్ని దేశాల కరెన్సీని తోసిరాజంటోంది. టర్కీ, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా తదితర దేశాల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా.. అక్కడ మన రూపాయి బలపడుతోంది. ఇదే అదనుగా ఆయా దేశాల్లో పర్యటనకు ఆసక్తి చూపిస్తున్నారు భారతీయులు.
కొన్ని నెలలుగా టర్కీ కరెన్సీ లీరా విలువ  తగ్గుతూ వస్తోంది. ఆరునెలల కిందట పదిహేను రూపాయలు పలికిన ఒక లీరా విలువ ఇప్పుడు సుమారు 11 రూపాయలకు పడిపోయింది. ఖర్చులు తగ్గే అవకాశం ఉండటంతో.. ఆ దేశానికి

వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్‌ విలువ ఇటీవల 10 శాతం తగ్గి.. నాలుగైదు రూపాయల మధ్య తచ్చాడుతోంది. పైగా వసతి ఖర్చులు కూడా తక్కువుండటంతో ఆ దేశానికేగే పర్యాటకుల సంఖ్య పెరిగిందంటున్నారు ట్రావెల్‌ ఆపరేటర్లు. లక్ష జనాభా కూడా లేని దక్షిణాఫ్రికాలోని పర్యాటక కేంద్రం అవ్‌శ్చూన్‌ పట్టణాన్ని ఏడాదిలో 30 వేల మంది భారతీయులు సందర్శించడం విశేషం. ఇండోనేషియా రూపియా కూడా నాలుగైదు శాతం పతనమవ్వడంతో బాలీపై దృష్టిసారిస్తున్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది. ఈజిప్ట్‌ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది.  మొత్తానికి ఆయా దేశాల్లోని పరిస్థితుల కారణంగా బలపడిన రూపాయి.. మనవారికి సరికొత్త ప్రదేశాలు చూసే భాగ్యం కల్పిస్తోంది.