Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానం చెప్పారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం రఫేల్ యుద్ధ విమానాలను చౌకగా కొంటున్నట్లు తెలిపారు. 2007లో యూపీయే ప్రభుత్వం చర్చలు జరిపి, నిర్ణయించిన ధర కన్నా 20 శాతం తక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. జైట్లీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. దేశ భద్రతకు రాహుల్ తీవ్ర హాని చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల దేశ భద్రతకు తీవ్ర హాని జరుగుతుందని జైట్లీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిందని తెలిపారు. దీనిలో మధ్యవర్తుల ప్రమేయం లేదన్నారు.
ఫ్రాన్స్‌తో జరిగిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ రహస్య నిబంధనల పేరుతో దోబూచులాడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ ఒప్పందంలోని ప్రైవేటు పార్టీలకు లబ్ధి చేకూర్చేందుకు అధిక ధరకు యుద్ధ విమానాలను కొనేందుకు అంగీకరించారని ఆరోపించారు.