Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పుల్వామా ఉగ్రదాడిని, వైమానిక దాడులను ప్రచారంగా చేసుకుని ఎన్నికల్లో మోదీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రదాడికి అవకాశం ఉందని ఇంటిలిజెన్స్‌ సమాచారం అందించినప్పటికీ సైనికుల రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ఆమె ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరులో రక్తం చిందించిన భారత సైనికుల త్యాగాలపై మోదీ రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దేశానికి, సైన్యానికి తాము వ్యతిరేకం కాదని, కేవలం మోదీ, బీజేపీకి మాత్రమే వ్యతిరేకమని మమత వివరించారు. పాక్‌-భారత్‌ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మోదీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని, అది దేశానికి సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైనికుల త్యాగాలను రాజకీయంగా ప్రచారం చేసుకోవాడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మమత ‍ప్రకటించారు.