Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సోషల్‌ మీడియాకు బానిసలయ్యారా? ఎంతవరకు అవసరమో అంతే ఉపయోగిస్తున్నారా? తెలుసుకోవడం కోసం ఈ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ఉపయోగ పడుతుంది.
కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రకు ప్లాన్‌ చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఎంజాయ్‌ చేయాలన్నది కండిషన్‌. అప్పుడు మీరేం చేస్తారు? 
ఎ. విహారయాత్రకు వెళుతున్నాననే సమాచారాన్ని పోస్ట్‌ చేస్తాను.
బి. కుటుంబసభ్యులతో ప్రశాంతంగా గడిపే సమయం దొరికినందుకు సంతోషంగా ఫీలవుతాను.
సి. ఒకరోజంతా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ చూడకుండా ఉండలేను.
విహారయాత్ర నుంచి తిరిగొచ్చారు. అప్పుడు మీరు… 
ఎ. సోషల్‌ మీడియాలో ఆ విషయం గురించి గొప్పగా చెబుతాను.
బి. స్నేహితులతో మాట్లాడతాను. ట్రిప్‌ గురించి వివరిస్తాను.
సి. వెంటనే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో విహారయాత్ర ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తాను.
ఆఫీసుకు చేరుకోగానే మీరు చేసే మొదటి పని ఏంటి? 
ఎ. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు చూస్తాను.
బి. కొలీగ్స్‌తో జనరల్‌ అంశాలపై మాట్లాడతాను. ఆ రోజుకు సంబంధించిన షెడ్యూల్‌ గురించి చర్చిస్తాను.
సి. ‘ఆఫీసుకు చేరుకున్నాను’ అని స్టేటస్‌ అప్‌డేట్‌ చేస్తాను.
బాగా పనిచేసి అలసిపోతే రిలాక్స్‌ అవసరం. అప్పుడు మీరేం చేస్తారు? 
ఎ. దుస్తులు మార్చుకుని టీవీ ముందు కూర్చుంటాను.
బి. పుస్తకం చదవడం వంటివి చేస్తాను.
సి. లాగిన్‌ అయి ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో చెక్‌ చేస్తాను.
తాజా సమాచారాన్ని ఎలా తెలుసుకుంటారు? 
ఎ. ఇతరులతో మాట్లాడి తెలుసుకుంటాను.
బి. వార్తాపత్రికలు, టీవీ చూస్తాను.
సి. ట్విట్టర్‌ లేదా మరొకటి… న్యూస్‌ ఏదైనా ఇక్కడే.
డిన్నర్‌ సమయంలో మీరు… 
ఎ.ఫే్‌సబుక్‌, ట్విట్టర్‌లో వచ్చిన పోస్ట్‌ల గురించి చెబుతాను.
బి. ఆ రోజంతా వారికి ఎలా గడిచిందో అడిగి తెలుసుకుంటాను.
సి. ఫోన్‌లో ఛాట్‌ చేస్తూ కామెంట్స్‌ పంపిస్తూ భోజనం పూర్తి చేస్తాను.
సమాధానాలు 
‘ఎ’ ఎక్కువగా వస్తే : స్వీయ నియంత్రణ అలవాటు చేసుకుంటే.. బానిస కాకుండా బయటపడవచ్చు. మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం మీకు చాలా అవసరం. చుట్టూ ఉన్న వారికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికైనా మారే అవకాశం ఉంది. ప్రయత్నించండి.
‘బి’ ఎక్కువగా వస్తే : సోషల్‌ మీడియా మీకు ఒక టూల్‌ మాత్రమే.
జీవితాన్ని ఆనందంగా ఎలా గడపాలో మీకు బాగా తెలుసు. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతారు.
‘సి’ ఎక్కువగా వస్తే : మీరు సోషల్‌ మీడియాకు బానిసయ్యారు. మీ పక్కనే కూర్చున్న స్నేహితున్ని సైతం మీరు పట్టించుకోవడం లేదు. వీలైనంత త్వరగా బయటపడే ప్రయత్నం చేయండి.