Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మార్చి మాసంలో దేశీయ కార్ల దిగ్గజాలకు మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చి నెల విక్రయాలు షాకివ్వగా, ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ వార్షిక విక్రయాల్లో వృద్ధిని సాధించింది.

మార్చి నెల విక్రయాలు ఎనలిస్టుల అంచనాలనుతాకడంతో పాటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు 16శాతం పెరిగాయని టాటా మోటార్స్‌ తెలిపింది. అయితే మార్చి నెలలో వాహన విక్రయాలు నామమాత్ర వెనకడుగుతో 68,709 యూనిట్లుగా నమోదయ్యాయి. గత మాసంతో పోలిస్తే 1శాతం తక్కువజ విదేశీ రీసెర్చ్‌ సంస్థ నోమురా అంచనాలను కంపెనీ అందుకుంది. దీంతో ఇవాల్టి మార్కెట్‌లో టాటా మోటార్స్‌ షేరు 8శాతం లాభపడి టాప్‌ విన్నర్‌గా నిలిచింది.

మరోవైపు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చినెల విక్రయాలు షాకిచ్చాయి. ఈ నెలలో విక్రయాలు1,47,613గా నమోదయ్యాయి. గతేడాది ఇదే మాసంలో1,48582 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. విదేశీ విక్రయాల్లో దాదాపు 13శాతం తగ్గి 10,463 యూనిట్లుగా మారింది. గత ఏడాది మార్చిలో 12,016 యూనిట్లను విక్రయించింది

అలాగే 2018-19 సంవత్సరానికిగాను మారుతీ విక్రయాలు వరుసగా ఏడవసారి పుంజుకుని 4.7శాతం పెరిగి 18,62,449కు చేరాయి. అంతకు ముందు సంవత్సరం 17,79,574గా నమోదైయ్యాయి.