Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భూమిని పోలిన గ్రహం మరొకటి ఉందా? అంటే అవుననే ఉంటున్నారు శాస్త్రవేత్తలు. మనకు ఆరు కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన మరో గ్రహం (సూపర్‌ ఎర్త్‌) ఉందని కనిపెట్టారు. ఇది సూర్యుడికి సమీపంలో ఉన్న బెర్నార్డ్స్‌ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని తెలిపారు. స్పేస్‌ స్టడీస్‌ ఆఫ్‌ కాటలోనియా, స్పెయిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ పరిశోధక బృందం టెలీస్కోప్ ల సాయంతో ఈ గ్రహాన్ని కనిపెట్టింది. ఇది భూమికంటే 3.2 రెట్లు పెద్దదని, గడ్డకట్టిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. బర్నార్డ్స్‌ స్టార్‌ బీగా పిలిచే ఈ గ్రహం.. సౌరకుటుంబానికి ఆవల, భూమికి దగ్గరలో ఉన్న రెండో గ్రహమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సూపర్‌ ఎర్త్‌పై -170 డిగ్రీల సెల్సీయ స్‌ ఉష్ణోగ్రత ఉందన్నారు. ఇది ఏమాత్రం నివాసయోగ్యమైనది కాదని తెలిపారు. 20 ఏళ్లపాటు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.