Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బీజింగ్‌: రక్షణ మంత్రుల స్థాయిలో హాట్‌లైన్‌ ఏర్పాటుతోపాటు 12 ఏళ్లనాటి రక్షణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే అంశంపై భారత్, చైనాలు చర్చలు జరుపుతున్నాయి. చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్‌ గత వారం ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి సీతారామన్‌తో సమావేశమయ్యారు. వుహాన్‌లో జిన్‌పింగ్, మోదీ మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. డోక్లాం సంక్షోభం వంటివి తలెత్తినప్పుడు రెండు దేశాల సైనికాధికారులు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే అంశం కూడా ఇందులో ఉందని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి బీజింగ్‌లో తెలిపారు. రెండు దేశాల రక్షణ మంత్రులతోపాటు సైనికాధికారుల మధ్య హాట్‌లైన్‌ ఏర్పాటు, 2006లో భారత్, చైనాల మధ్య కుదిరిన పరస్పర అంగీకార ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు కూడా చర్చలు జరిగాయన్నారు.