Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నందితాదాస్‌ విలక్షణమైన నటి, దర్శకురాలు. పది భాషల్లో 40 సినిమాల్లో నటించారు. దీపామెహ్‌తా తీసిన ‘ఫైర్‌’ (1996) చిత్రంలో యాక్ట్‌ చేసినందుకు ఎన్నో మాటలు పడ్డారు. భారతీయ సంస్కృతిని మంటకలిపేసిందని సంప్రదాయవాదులు ఆమెను దూషించారు. హోమోసెక్సువల్‌ రిలేషన్స్‌ని అందులో చూపారు. అదీ కోపం. అయితే ‘‘అప్పుడే నయం. ఇప్పటి మనుషుల్లో ఆ మాత్రం సహనమైనా లేకుండా పోయింది’’ అని ఇటీవల ముంబై ఐ.ఐ.టి.లో జరిగిన ‘సౌత్‌ ఏషియన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ జెండర్‌ అండ్‌ సెక్సువాలిటీ’ సదస్సులో నందిత అన్నారు. ఆమె మాటలు నిజమేననిపిస్తోంది.. ఇప్పటికింకా చల్లారని ‘పద్మావతి’ వివాదాన్ని చూస్తుంటే. ‘‘ఎందుకనో మనుషుల్లో భయం పెరిగిపోయింది. మౌనంగా ఉండిపోతున్నారు. మనసులో ఉన్నది చెప్పడమే నేరమౌతున్న రోజులు వచ్చిపడ్డాయి. పడుతుందో లేదో తెలియని దెబ్బ నుంచి ముందే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నందిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ భయం సమాజానికి మంచిది కాదు’’ అన్నారు. నిజమే. భయం నాగరిక లక్షణం కూడా కాదు.