Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలుల హక్కుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూపొందించిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టాలతో జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అత్యాధునిక పద్ధతుల్లో ఫిర్యాదులను స్వీకరిస్తున్నది. ఒకసారి వైబ్‌సైట్‌ పోర్టల్‌లో ఫిర్యాదు వెళ్లగానే అధికారులు పరిశీలించి, సంబంధిత జిల్లా ఎస్పీకి, నగర పోలీస్‌ కమిషనర్‌కు, స్ర్తీ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ పీడీకి సంక్షిప్త వివరాలు పంపుతారు. వాటి ఆధారంగా బాధిత బాలికల నుంచి అంత్యంత రహస్య పద్ధతిలో సమాచారం సేకరిస్తారు. వెబ్‌పోర్టల్‌ ఫిర్యాదులపై కేసు నమోదుకు సంబంధిత ఎస్పీ, కమిషనర్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేస్తారు. ఆయా ఫిర్యాదులపై ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది.
 తక్షణమే చర్యలు..
వెబ్‌సైట్‌లో ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. బాలికలు లైంగిక వే ధింపులను దైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ వెబ్‌సైట్‌ ఉపకరిస్తుంది.
 ఫిర్యాదు ఇలా..
బాధిత బాలికలు ఇంటర్‌నెట్‌లోకి వెళ్లి www.ncpcr.gov.in  అని టైప్‌ చేస్తే సంబం ధిత వె బ్‌పేజీ ఓపెన్‌ అవుతుంది. స్ర్కీన్‌పై ఎరుపు రంగులో ఉన్న ఈ-బాక్స్‌ అనే బటన్‌ను క్లిక్‌ చేస్తే వెంటనే రెండో పేజీలోకి వెళ్తారు. ‘ఎన్‌సీపీసీఆర్‌’ అని కనిపించే పేజీలో మహిళ బొమ్మ పక్కనే ఉన్న బాణం గుర్తు చూపుతున్న ‘ప్రెస్‌ హియర్‌’ అనే బ్లూ కలర్‌ బటన్‌ నొక్కాలి. బాలలు ఎలాంటి వేధింపులకు గుర వుతున్నారో తెలిపే ఆరు రకాల కార్టూన్‌ బొమ్మలు స్ర్కీన్‌పై దర్శనమిస్తాయి. కార్మూన్‌ బొమ్మల్లో మీరు వేధింపులకు గురయ్యే విధానాన్ని సూచించే చిత్రంపై క్లిక్‌ చేయాలి. అక్కడే మీ పేరు, ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ ఇవ్వవచ్చు. (సంఘటన వివరాలు క్లుప్తంగా ఇవ్వవచ్చు.) వెంటనే స్ర్కీన్‌పై వచ్చే సెక్యూరిటీ కోడ్‌ను టైప్‌ చేస్తే నేరుగా జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పోర్టల్‌లోకి వెళ్తుంది. సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే ఫిర్యాదు కమిషన్‌కు చేరుతుంది.
బాలలహక్కులపై అవగాహన కల్పిస్తున్నాం..
బాలల హక్కులపై అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెలా మూడో శనివారం బాలికల పాఠశాలల్లో నిర్వహించే స్వరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్ప్‌లైన్‌ ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. మహిళలు 181కు ఫోన్‌ చేసి తమ సమస్యలను వివరించవచ్చు