Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

  • ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. అయితే బార్లీ ఇందుకు భిన్నమైనది. ఎక్కువ శక్తినిచ్చే పదార్థమే అయినా సులభంగా జీర్ణమవుతుంది. అందుకే అస్వస్థులైన వారికి బార్లీ ద్రావణం ఇస్తూ ఉంటారు. లో-ఫ్యాట్‌ డైట్‌గా కూడా బార్లీ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతోంది.
  • చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతోందన్నా. గ్లూకోజ్‌ నిలువలు పెరుగుతున్నాయన్నా మనసు వెంటనే వైద్య చికిత్సల మీదికే వెళుతుంది. కానీ, ఆ అవసరం లేకుండా, ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలు కూడా వాటి నియంత్ర ణకు తోడ్పడతాయనే అంశం మాత్రం మన ధృష్టికే రాదు. నిజానికి ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిండంలోనూ, ప్రి- డయాబెటిక్‌ స్థాయికి వెళ్లిన గ్లూకోజ్‌ నిలువలను సాధార ణ స్థాయికి తీపుకు వెసళ్లడంలోనూ బార్లీ బాగా తోడ్పడుంది. అందుకే టైప్‌-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు బార్లీని తమ ఆహారంలో ఒక ప్రధాన భాగంగా చేర్చుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • మూత్ర విసర్జన సాఫీగా లేక శరీరం ఉబ్బిపోతున్న వారికి బార్లీ ధాన్యం గొప్ప ఔషధంగా (డ్యూరెటిక్‌) పనిచేస్తుంది.
  • బార్లీ ధాన్యంలో మరో విశేషం కూడా ఉంది. ముఖ్యంగా ఓట్లు, గోదుమల వంటి ధాన్యాన్ని శుద్ది చేసినప్పుడు వాటిలోని పీచుపదార్థం హరించుకుపోతుంది. కానీ, బార్లీలో ఉండే బీటా – గ్లూకన్‌ అనే ప్రత్యేక పీచుపదార్థం శుద్ధి చేసిన తర్వాత కూడా స్థిరంగా ఉంటుంది.