Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇటీవల తమిళ నటుడు సూర్య హీరోగా విగ్నేష్ శివన్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం గ్యాంగ్. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నటుడు సూర్య నిన్న రాజమహేంద్రవరం చేరుకున్నారు. నగరం లోని ఊర్వశి థియేటర్ కి విచ్చేసిన ఆయనను థియేటర్ ఆవరణలో అభిమానులు సెల్ఫి లు దిగేందుకు చుట్టుముట్టారు. పోలీసులు, బౌన్సర్లు చుట్టూ వున్నా కానీ అభిమాన సందోహాన్ని ఆపలేకపోయారు. ఒక్కసారిగా అందరూ వచ్చి సెల్ఫి ల కోసం ఎగపడడంతో ఆయన కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. తరువాత హాల్ లో నుండి ఎలా బయట పడాలో అర్ధంకాక హాల్ గేట్ దూకి చివరకు బయటకి చేరుకున్నారు. ఆ విధంగా గేట్ దూకిన సూర్య తీరు అభిమానులను కొంత షాక్ కు గురి చేసింది. చివరకు బయటకు వచ్చిన ఆయన బౌన్సర్లతో రెడీగా వున్న తన కారులో రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్ లో తిరుగు పయనమయ్యారు.