Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చైనాను నిరవధికంగా పాలించాలన్న అధ్యక్షుడు జింగ్‌ పింగ్‌ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన పాలనలో చైనా మరో ఉత్తర కొరియాలా మారుతుందన్న ఆందోళనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణాలను వివవరిస్తున్న విశ్లేషకులు మున్ముందు ఆ నిర్ణయం చైనాకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

2013లో మార్చి 14న 64 ఏళ్ల జింగ్‌ పింగ్‌ తొలి దఫా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ మార్చితో ఆయన పదవీకాలం ముగియబోతోంది. చైనా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హుడు. కానీ, జీ జిన్‌పింగ్‌ మాత్రం ఆ నిబంధనను సవరించేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసింది. త్వరలో దానికి పార్లమెంట్‌ అధికారిక ముద్ర కూడా వేయబోతోంది.

గతేడాది అక్టోబర్‌లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ ప్రతిపాదనను పార్లమెంట్‌ ఆమోదించింది. లీకుల ద్వారా ఆ విషయం బయటికి పొక్కటంతో విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన పదవీ కాలం దగ్గరపడుతుండటం, ఆ ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేందుకు పావులు కదుపుతుండటంతో విమర్శకులు, విశ్లేషకులు రంగంలోకి దిగిపోయారు.