Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో సంచలన విషయం వెలుగుచూసింది. భారతదేశంలోని 43 శాతం మంది మహిళలు రుతుస్రావం సమయంలో శానిటరీ ప్యాడ్స్ వినియోగించడం లేదనే వాస్తవం ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సర్వేలో తేలింది. దేశంలో 36 శాతం మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్ కొనాలంటే అసౌకర్యానికి గురవుతున్నారట. గత సంవత్సరం అక్టోబరు నెలలో దేశంలోని బెంగళూరు, చెన్నై, కటక్, ఢిల్లీ, ఇండోర్, జైపూర్, కాన్పూర్, కోల్ కతా, ముంబై, రాంచీ, శ్రీనగర్, సూరత్, తిరువనంతపురం తదితర 35 నగరాల్లోని మహిళలను సర్వే చేయగా 43 శాతం మంది మహిళలు రుతుస్రావం సమయంలో ప్యాడ్స్ వాడటం లేదని తేలింది. కాగా మన దేశంలో 2015-16లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 62 శాతం మహిళలు పిరియడ్స్ సమయంలో ప్యాడ్స్ స్థానంలో గుడ్డముక్కలు వాడుతున్నారని వెల్లడైంది.