Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టిఆర్ఎస్ పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కె సి ఆర్ కొన్ని ప్రణాళికలను తయారు రచిస్తున్నారని, ఇప్పటివరకు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరించ చేరువ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెపుతున్నారు. ఇందులో భాగం గానే ఒక సరికొత్త రీతిలో ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, పధకాలను వీడియో ల ద్వారా డాక్యుమెంటరీలు రూపంలో మరింత మందికి చేరువయ్యేలా చేయనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పధకాల ద్వారా లబ్ధిపొందిన వారే కాకుండా అన్ని వర్గాల వారు ప్రజలు చూసేలా పకడ్బందీగా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఈ డాక్యూమెంటరీలు రూపొందిస్తున్నారని అంటున్నారు.ఈ విధానం ద్వారా ముందుకు వెళితే తమ పరిపాలన పై ప్రజల్లో వున్న అభిప్రాయం పై ఒక స్పష్టత వస్తుందని, తద్వారా తెలుసుకున్న లోటుపాట్లను సరిచేసుకుని మరింత మెరుగైన పాలన అందించే దిశగా ముందుకు వెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు. అంతే కాక రానున్న రోజుల్లో మరిన్ని నూతన కార్యక్రామాల రూపకల్పనతో వచ్చే ఎన్నికలపై దృష్టిపెట్టనున్నారట.

పార్టీ అధికార వర్గాల సమాచారం మేరకు ఒక 30 డాక్యుమెంటరీ లను , 20 లఘు చిత్రాలను అధికారులు రూపొందిస్తున్నారని, వీటి రూపకల్పన లో ముఖ్యమైన సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకున్నారని సామాచారం. గరిష్టంగా నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించినట్లు చెపుతున్నారు. వాటిని ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఇతర ముఖ్యులు పరిశీలించిన తర్వాత విడుదల చేయనున్నారట. ప్రజాధరణ పొందుతున్న పధకాలను విస్తృతపరచి తద్వారా వాటిని మరింత మందికి చేరువ చేయటమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని అన్నారు. తెలంగాణ వెనుకబాటు తనాన్ని తరిమికొట్టే విధంగా తాను తీసుకున్న కీలక నిర్ణయాలు తదనంతర క్రమంలో అమలైన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను హైలైట్ చేయనున్నారు. ఈవిధమైన విధానం ప్రజలకు తమను మరింత చేరువ చేస్తుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం.