Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్‌ ఎయిర్‌ ఇండియా పైలట్లకు షాక్‌ ఇచ్చింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ నిర్ధేశించిన ఆహార పదార్ధాలనే ఆర్డర్‌ చేయాలని, స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేయడం కుదరదని పైలట్లకు స్పష్టం చేసింది. సంస్థ నిర్దేశించిన మీల్స్‌ షెడ్యూల్‌కు భిన్నంగా విమాన సిబ్బంది స్పెషల్‌ మీల్స్‌ ఆర్డర్‌ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని..ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని పైలట్లకు పంపిన ఈమెయిల్‌ సందేశంలో ఎయిర్‌ ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఆరోగ్య కారణాలతో వైద్యుడి సిఫార్సుతో మాత్రమే సిబ్బంది స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేయవచ్చని వివరణ ఇచ్చారు. కాగా, పైలట్లు తమ కోసం బర్గర్లు, సూప్‌ల వంటి స్పెషల్‌ మీల్స్‌ను ఆర్డర్‌ చేసు​‍్తన్నట్టు వెల్ల్లడైందని, ఇది సంస్థ ఆహార వ్యయాల్లో పెరుగుదలతో పాటు ఆహార నిర్వహణ వ్యవస్థను డిస్టబ్‌ చేస్తోందని ఎయిర్‌ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి.