Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రోహిత్‌ శర్మ

దుబాయ్‌: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడటానికి ఉత్సాహంగా ఉన్నామని టీమిండియా తాత్కలిక కెప్టెన్‌ రోహిత్‌శర్మ అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్‌-2018లో భాగంగా భారత్‌ దాయదీ పాక్‌తో 19న తలపడనుంది. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ అనంతరం భారత్‌-పాక్‌లు తలపడటం ఇదే తొలిసారి. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు, అభిమానులు ఈ మ్యాచ్‌కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు మంచి క్రికెట్‌ ఆడాం. ఈ టోర్నీ ప్రపంచకప్‌ సన్నాహకంగా ఉపయోగపడనుంది. పాక్‌తో మ్యాచ్‌ ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాం. మేం ఈ మ్యాచ్‌పైనే దృష్టిపెట్టాం. వారు ఈ మధ్యకాలంలో మంచి క్రికెట్‌ ఆడుతున్నారు. ఢిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నా.. ప్రతీజట్టు టైటిలే లక్ష్యంగా ఆడనుంది. ప్రతీ జట్టుకు వారి బలాల దగ్గట్లు వ్యూహాలున్నాయి. దీంతో ఈ టోర్నీ రసవత్తరంగా సాగనుంది. తొలిసారి ఓ టూర్‌కు పూర్తిస్థాయి సారథ్యం వహించడం ఆనందంగా ఉంది.’ అని తెలిపాడు.

తమ ప్రదర్శనతో  ప్రేక్షకులను రంజింప చేయడానికి  ప్రతిజట్టుకు ఇదో మంచి అవకాశమని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపాడు. శనివారం శ్రీలంక-బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇక భారత్‌ 18న హాంకాంగ్‌తో, 19న దాయదీ పాకిస్తాన్‌తో తలపడనుంది.