Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ ఆడ్వాణీ కెరీర్‌లో 20వ ప్రపంచ టైటిల్‌ సాధించాడు. మయన్మార్‌లో జరిగిన ఐబీఎస్‌ఎఫ్‌ బిలియర్డ్స్‌ (150-అప్‌ ఫార్మాట్‌) ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పంకజ్‌ విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంకజ్‌ 6-2 స్కోరు తేడాతో మయన్మార్‌ ఆటగాడు నే తవేపై విజయం సాధించి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. అంతకుముందు సెమీ్‌సలో డేవిడ్‌ కాసియర్‌ను ఓడించి పంకజ్‌ ఫైనల్‌ చేరాడు. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల పంకజ్‌కు ఇది క్యూస్పోర్ట్స్‌ (బిలియర్డ్స్‌, స్నూకర్‌ కలిపి)లో 20వ ప్రపంచ టైటిల్‌ కావడం విశేషం. ఈ షార్టర్‌ ఫార్మాట్‌లో పంకజ్‌కు ఇది హ్యాట్రిక్‌ ప్రపంచ టైటిల్‌. 2016లో సొంతనగరం బెంగళూరులో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన పంకజ్‌.. గతేడాది దోహా వేదికగా జరిగిన ఈవెంట్‌లో టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. గత రెండువారాల్లో పంకజ్‌కు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్‌. రెండువారాల క్రితమే చైనా వేదికగా ఆసియా స్నూకర్‌ ఈవెంట్‌లో పంకజ్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఈ విజయం నాకు చాలా ప్రత్యేకం. ఇది పర్‌ఫెక్ట్‌ 20. మరిన్ని టైటిళ్లు సాధించాలనుకుంటున్నా’ అని పంకజ్‌ అన్నాడు.