Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కషాయం రూపంలో తీసుకునే ఆయుర్వేద ఔషధాలు రెండు రకాలు. ఒకటి అంతర్గతంగా తీసుకునేవి.. రెండోది బాహ్యంగా వాడేవి. ఆయుర్వేదం ఇలాంటి వేల రకాల ఔషధ కషాయాల్ని తయారు చేసింది. అలానే నోటి పూతతో బాధపడేవారికి ఎలాంటి కషాయం తీసుకోవాలో తెలిపింది. ఆ కషాయం తీసుకుంటే.. నోటి పూత నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. మరి ఆ కషాయం ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం – 2 స్పూన్స్
మల్లె ఆకులు – కొన్ని
ఎండ్రుదాక్ష – గుప్పెడు
నీరు – 1 గ్లాస్

ఎలా చేయాలి:
ముందుగా నీళ్లల్లో త్రిఫల చూర్ణం, మల్లె ఆకులు, ఎండుద్రాక్ష వేసి బాగా మరిగించుకోవాలి. ఈ కషాయన్ని చల్లార్చిన తరువాత నీరు పుక్కిలించాలి. ఆ తరువాత మళ్లీ కషాయం తాగాలి. ఇలా క్రమంగా చేస్తుంటే.. నోటి పూత తగ్గుతుంది.