Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నోకియా బ్రాండ్‌కున్న క్రేజే వేరు. స్మార్ట్‌ఫోన్ల ఆగమనంతో నోకియా బ్రాండ్‌ మధ్యలో కొన్నేళ్లు తన వైభవం కోల్పోయినప్పటికీ.. తాను కూడా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టి, కస్టమర్లను మళ్లీ తన సొంతం చేసుకుంది. నోకియా అంటేనే ప్రజల బ్రాండ్‌గా ముద్ర వేసుకుంది. మంగళవారం నోకియా రెండు తన గేమ్‌ చేంజర్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అవి ఒకటి నోకియా 6.1 ప్లస్‌, మరొకటి నోకియా 5.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను నేడు భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు  ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. టాప్‌-నాచ్‌ డిస్‌ప్లే, ఐఫోన్‌ ఎక్స్‌ స్ఫూర్తితో వెనుకవైపు మొత్తం గ్లాస్‌, 5.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీప్లస్‌, 2.5డీ గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ నోకియా 6.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6.1 ప్లసే.

నోకియా 5.1 ప్లస్‌, నోకియా 6.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు రెండూ డ్యూయల్‌ కెమెరాలతో వచ్చాయి. నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు రెండూ నోకియా ఎక్స్‌6, నోకియా ఎక్స్‌5 స్మార్ట్‌ఫోన్లకు రీబ్రాండెడ్‌ వెర్షన్లు.
నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్లు..
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
3,060 ఎంఏహెచ్‌ బ్యాటరీ
యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌
16 ఎంపీ, 5 ఎంపీ లతో వెనుకవైపు రెండు కెమెరాలు
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
ధర : 15,999 రూపాయలు

నోకియా 5.1 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 
గ్లాస్‌ బాడీ, డ్యూయల్‌ లెన్స్‌ కెమెరా
నాచ్‌ డిస్‌ప్లే
5.9 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
మీడియాటెక్‌ పీ60 చిప్‌సెట్‌
3జీబీ లేదా 4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
13 ఎంపీ, 5 ఎంపీ లెన్స్‌తో వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
నోకియా 5.1 ప్లస్‌ ధర : సెప్టెంబర్‌లో రివీల్‌ చేయనున్నారు.