Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వాషింగ్టన్‌: ధ్రువాల్లో మంచు దుప్పటి ఎంత మేరకు ఉంది? సముద్ర నీటిమట్టమెంత? కార్చిచ్చు ఎక్కడి దాకా వ్యాపించింది? వరద ప్రవాహాల ఎత్తెంత? అడవుల విస్తీర్ణ శాతం ఎంత మేరకు తగ్గింది? పట్టణ విస్తీర్ణం, రిజర్వాయర్లలో నీటిమట్టం ఎంత? ఇలాంటి నైసర్గిక ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిద్ధమవుతోంది.

భూమి నైసర్గికస్వరూపాన్ని కచ్చిత కొలతలతో చెప్పేందుకు ఐస్, క్లౌడ్‌ అండ్‌ ల్యాండ్‌ ఎలివేషన్‌ శాటిలైట్‌ (ఐసీఈశాట్‌–2)ను తయారుచేసింది. దీన్ని సెప్టెంబర్‌ 12న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. శాటిలైట్‌లో నూతన సాంకేతికతతో టోపోగ్రాఫిక్‌ లేజర్‌ అల్టిమీటర్‌ సిస్టమ్‌ (ఏటీఎల్‌ఏఎస్‌)ను అమర్చారు. ఏటీఎల్‌ఏఎస్‌  అనుక్షణం మండుతూ వేల కోట్ల పోటాన్లను భూగోళంపై పడేలా చేస్తుంది. అవి పరావర్తనం చెంది ఆయా చోట్లలోని పర్వతం, మంచు, ఇలా ప్రతీదాని స్వరూప, స్వభావాలను తెలుపుతుంది. ఉదాహరణకు, పర్వతాన్ని తాకి పరావర్తనం చెందిన పోటాన్ల సాయంతో పర్వతం కచ్చితమైన ఎత్తు తెలుస్తుంది.