Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆలోచనకు ఆత్మీయత తోడైంది
నగరంలో పలు కల్యాణ మండపాల వద్ద శుభకార్యాలు ముగిశాక మిగిలిపోయిన అన్నాన్ని కుప్ప లుగా అలాగే వదిలేస్తుండడం అశోక్‌ మనస్సును కదిలించింది. ఏదో చేయాలన్న తపన మొదలైంది. కేవలం తానొక్కడే సంకల్పించుకుంటే సరిపోదని భావించాడు. అందుకు కుటుంబ సభ్యుల సలహా తీసుకున్నారు. వారి ప్రోత్సాహం తోడైంది. మొదట్లో కల్యా ణ మండపాల వద్ద మిగిలిపోయిన అన్నం, కూరలు, ఇతర ఆహార పదార్థాలను సేకరించి అన్నార్తులకు పెడుతుండేవాడు. అందుకు ప్లేట్లు, గ్లాసులకు సొంతంగానే ఖర్చు చేసేవారు. తాను చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను ఫేస్‌బుక్‌, వాట్సా్‌పలతో అప్‌లోడ్‌ చేయడంతో మరి కొంతమంది స భ్యులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. అవసరమైన సహకారంతోపాటు ఖర్చును కూడా తమకు తోచిన విధంగా సహకరిస్తుండడం మొదలుపెట్టారు. స్నేహితులు పెరిగిపోవడంతో నగరం నలువైపుల నుంచి మిగిలి పోయిన ఆహార పదార్థాల సేకర ణ సులువైంది. ఎక్కడ శుభకార్యం జరిగినా సమాచారం అందిస్తే చాలు వాటిని ‘వృధా’ కానివ్వం అంటూ భరోసా ఇస్తారు. చివరి ము ద్దను కూడా వృధా కానివ్వకుండా, నగరంలోని ప్రధా న సెంటర్‌లలో రాత్రివేళ తిండి లేక అలమటిస్తున్న వారిని తట్టి మరీ నిద్రలేపి ఆకలి తీరుస్తారు. అవసరమైతే అర్ధరాత్రి వరకు ఉండి ఆటోవాలాలకు, అదరణ లేని వారికి కడుపు నిండా తిండి పె ట్టి తృప్తిని పొందుతున్నారు.
అవమానాలు భరిస్తూనే..
అధిక శాతం శుభకార్యక్రమా లు రాత్రి వేళ 10 గంటల నుంచే మొదలవుతాయి. ఆ తర్వాత ఫంక్ష న్‌ హాల్స్‌, కల్యాణ మండపాలలో మిగి లిన ఆహార పదార్థాలను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనంలో ఎంచుకున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఇలా అర్ధరాత్రి వాహనం తరలింపులో ఒకరిద్దరు పోలీసులు తాము చేస్తున్న సేవను అభినందించి, సహకరిస్తున్నప్పటికీ, మరికొంతమంది అనుమతి లేదంటూ హెచ్చరికలు చేస్తున్నారు.. తమ నిస్వార్థమైన సేవకు పోలీసు సహకారంకూడా ఉం టే బాగుంటుందని వారు చెబుతున్నారు.
ఆకలికి పెద్దా, పేదా తేడా ఉండదు కదా అందుకే..
ఆకలికి పెద్ద, పేద తేడా ఉండదు. కడుపులో ఆకలి, కళ్లెదుట భోజనశాలలు, కానీ జేబులో పైసా డబ్బులు ఉండవు. కల్యాణ మండపాల వద్దేమో కుప్ప లు కుప్పలుగా అన్నం వ్యర్థం. అలా ఆ ఆలోచన మొదలైంది. ఎవరికైనా ఏదైనా ఇ స్తే ఇక చాలు అనరు. కానీ కడుపు నిండా అన్నం పెడితే ఖచ్చితంగా ఇక చాలు అంటారు. అంతకంటే సంతృప్తి ఏముంటుంది. తొలి రోజుల్లో ఒకరిద్దరంతో మొదలయ్యాం. నేడు 50 మందికి పైగా సభ్యులు చేరారు. ఎవరూ ఏమీ ఆశించరు. ప్రతి ఒక్కరిలోనూ ఒక్కటే ఆలోచన ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. ఎక్కడ శుభకార్యాలు జరిగినా 80192 02051 ఫోన్‌ నంబర్‌కు సమాచారం అందిస్తే మేం వచ్చి కలుస్తాం. మిగిలిపోయినా ఆహారం మాకిస్తే చాలు. పదిమందికి పెట్టి మనిషి ఆకలి తీరుస్తాం. మా సేవలో మీరు భాగస్వాములు కండి..