Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లండన్‌ : నిద్రలేమితో కునుకుపాట్లు పడేవారికి అల్జీమర్స్‌ బారిన పడే ముప్పు మూడు రెట్లు అధికమని జాన్స్‌ హాకిన్స్‌, యూఎస్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌ పరిశోధకులు వెల్లడించారు. పగటిపూట నిద్ర పాట్లతో సతమతమయ్యేవారిలో అల్జీమర్స్‌ రిస్క్‌ అధికంగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.మన ఆరోగ్యంపై నిద్ర ప్రభావం మనం ఊహించిన దాని కంటే అధికంగా ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని వారు చెప్పారు. 123 మంది వాలంటీర్లపై 16 ఏళ్ల పాటు పరిశీలించిన మీదట ఈ వివరాలు రాబట్టా​‍మని తెలిపారు.

నిద్రలేమి, ఒత్తిడి ఇతరత్రా కార ణాలతో పగటిపూట కునికిపాట్లు పడితే అల్జీమర్స్‌ వ్యాధి బారినపడే అవకాశం అధికమని గుర్తించామన్నారు. అల్జీమర్స్‌ నియంత్రణకు వ్యాయామం, పోషకాహారం, మానసిక ఉత్తేజం వంటివి ఉపకరిస్తాయని వెల్లడైనా నిద్రతో ఈ వ్యాధికి నేరుగా ఉన్న సంబంధం తమ అథ్యయనంలో తేలిందని జాన్స్‌ హాకిన్స్‌ బ్లూంబర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆడమ్‌ పీ స్పైరా చెప్పారు. సరైన నిద్రకు ఉపక్రమించడం ద్వారానే అల్జీమర్స్‌కు చెక్‌ పెట్టవచ్చని అన్నారు.