Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దధానా కర పదాభ్యాం అక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య నుత్తమా
శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండవరోజున (గురువారం) శ్రీ భ్రమరాంబిక అమ్మవారు ‘బ్రహ్మచారిణి’ అలంకారంలో దర్శనమిస్తారు. నవదుర్గ రూపాల్లో ద్వితీయ రూపిణియైున బ్రహ్మచారిణీ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు చేకూరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ద్విభుజురాలైన ఈ దేవి కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో భ్రమరాంబా దేవికి బ్రహ్మచారిణి అలంకార సేవ నిర్వహించి, విశేష అర్చనలు, ప్రత్యేక హరతి పూజలు జరుపుతారు.
రాత్రి ఎనిమిది గంటలకు మయూర వాహనాన్ని అధిరోహించిన మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి, ప్రధాన వీధుల్లోకి తోడ్కొని వచ్చి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు నృత్యాలు ప్రదర్శిస్తారు.
నైవేద్యం: దద్ద్యోజనం, సాంబారు అన్నం, చక్కెర పొంగలి, సెనగ గుగ్గిళ్లు