Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఆదివారం కాస్త నెమ్మదించింది. ప్రవాహ వేగం తగ్గినప్పటికీ ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజీ వద్ద ఈరోజు మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఆదివారం కాస్త నెమ్మదించింది. ప్రవాహ వేగం తగ్గినప్పటికీ ఉద్ధృతి మాత్రం కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజీ వద్ద ఈరోజు మధ్యాహ్నం 12గంటల సమయానికి 12.7 అడుగుల నీటి మట్టం ఉంది. 11లక్షల 17వేలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు.

బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో కోనసీమ లంక గ్రామాలన్నీ ఇంకా ముంపులోనే ఉన్నాయి. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం మండలాల్లో లంకలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. కాజ్‌వేలపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు సాగించడానికి లంకవాసులు నానా పాట్లు పడుతున్నారు. రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాల్లోని గోదావరి తీరం వెంబడి అరటి, ఉద్యానవన పంటలు నీటిలో నానుతున్నాయి. రాజమహేంద్రవరం ఎగువున సీతానగరం మండలం ములకల్లంక ఇంకా జల దిగ్భందంలోనే ఉంది. దేవీపట్నం మండలంలో సీతపల్లి వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో గోకవరం, ఇందుకూరుపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసరాలు అందక గిరిజన గూడేల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లో వరద ఉద్ధృతికి తోడు జోరున వర్షం పడుతోంది. మండల కేంద్రాలతో గిరిజన గూడేలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలాచోట్ల వరదకు వర్షం తోడు కావడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 12గంటల సమయానికి 12.7 అడుగుల నీటి మట్టం ఉంది. 11లక్షల 17వేలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు.

బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో కోనసీమ లంక గ్రామాలన్నీ ఇంకా ముంపులోనే ఉన్నాయి. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం మండలాల్లో లంకలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. కాజ్‌వేలపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు సాగించడానికి లంకవాసులు నానా పాట్లు పడుతున్నారు. రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాల్లోని గోదావరి తీరం వెంబడి అరటి, ఉద్యానవన పంటలు నీటిలో నానుతున్నాయి. రాజమహేంద్రవరం ఎగువున సీతానగరం మండలం ములకల్లంక ఇంకా జల దిగ్భందంలోనే ఉంది. దేవీపట్నం మండలంలో సీతపల్లి వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. దీంతో గోకవరం, ఇందుకూరుపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసరాలు అందక గిరిజన గూడేల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన మండలాల్లో వరద ఉద్ధృతికి తోడు జోరున వర్షం పడుతోంది. మండల కేంద్రాలతో గిరిజన గూడేలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలాచోట్ల వరదకు వర్షం తోడు కావడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.