Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలీవుడ్‌కు గడిచిన మూడు నెలల్లో భారీ హిట్‌ దక్కలేదు. గల్లీబాయ్స్‌, టోటల్‌ ధమాల్‌ లాంటి సినిమాలు మంచి కలెక్షన్లనే సాధించినా అవి అద్భుత విజయాలు కావు. పెద్ద విజయాల కోసం వేచి చూస్తున్న బాలీవుడ్‌కు తానున్నానంటూ వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ పేరు తెచ్చుకున్న ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రం కేసరితో రంగంలోకి దూకారు. గురువారం విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 78 కోట్లను కలెక్ట్‌ చేసింది. దీంతో అక్కీ మరోసారి భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నాడు.

ఐపీఎల్‌ సందడిలో కూడా కేసరి బాలీవుడ్‌లో ఈ సంవత్సరపు అత్యధిక ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మొదటి వారాంతం పూర్తయ్యాక ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌ వైపు వడివడిగా పరుగులు పెడుతోంది. సిక్కు సైనికుల పోరాటపటిమను కళ్లకు కట్టిన ‘సారాగఢి’ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజు రూ. 21 కోట్లు, 3వ రోజుకు 50 కోట్ల క్లబ్‌లో చేరిన కేసరి చిత్రం.. 4వ రోజుకు 78 కోట్ల మార్క్‌ను అందుకుందని బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. ఐపీఎల్‌ ప్రభావంతో శని, ఆదివారాల్లో కేసరీకి రావాల్సినంత వసూళ్లు రాలేదని, రెండో వారాంతంలో సినిమా నిలకడను బట్టి కలెక్షన్లు, రికార్డులు ఆధారపడతాయని ఆయన విశ్లేషించారు.