Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అందాల చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్దం నుంచి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సౌత్‌లో చాలా మంది స్టార్ హీరోల సరసన కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. మూడు పదుల వయసులో కూడా కాజల్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన.. ‘క్వీన్’ రీమేక్‌‌గా తమిళంలో తెరకెక్కుతున్న ‘పారిస్ పారిస్‌’ చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.

అయితే ఇప్పటి వరకూ హీరోయిన్‌గా అలరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో విలన్‌గా దర్శనమివ్వనుందట. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో కాజల్ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ సినిమాలో కాజల్ ‘సీత’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తీవ్రంగా కష్టపడుతోందట. డబ్బు పిచ్చి ఉన్న ఓ అమ్మాయి పాత్రలో కాజల్ మనకు కనిపిస్తుందని సమాచారం. కాజల్ కెరీర్‌లోనే తొలిసారిగా ఇలాంటి పాత్రలో నటిస్తుందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఈ విషయంపై మనకు క్లారిటీ రావాలంటే.. చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం రావాల్సిందే మరీ..