Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నువ్వులతో ఏ రకం ఆహారం తయారుచేసినా చాలా రుచికరంగా ఉంటుంది. అయితే నువ్వుల పొడిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో లక్షణాలున్నాయి. దీనిని రోజూ తినే ఆహారంలో కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు అంటున్నారు. నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే ఎంతో మంచిది. పరిమాణంలో చాలా చిన్నగా ఉండే నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధగుణాలున్నాయి.

వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం. ఐరన్‌, ఫాస్పరస్‌, విటమిన్‌ బి, జింక్‌, పీచుపదార్థాలు తదితర పోషకాలు అత్యధికంగా లభిస్తాయి. ఇవి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్‌ వల్ల కలిగే నొప్పిని, వాపును తగ్గించడంలో నువ్వుల్లో ఉన్న కాపర్‌ సహకరిస్తుంది. ఆస్తమాను అరికట్టడంలో నువ్వుపొడిలోని మాంగనీస్‌ ఉపకరిస్తుంది.

గుండెపోటు, స్ట్రోక్స్‌కు దారితీసే రక్తపోటును తగ్గించడంలో నువ్వుపొడిలోని మాంగనీస్‌ ఉపకరిస్తుంది. కలోన్‌ క్యాన్సర్‌, ఆస్టియోపోరోసిస్‌, మైగ్రేన్‌, బహిష్టు ముందు కలిగే సమస్యలను తగ్గించడంలో వీటిలోని క్యాల్షియం తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించగల గుణాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల పొడిని తరచూ తీసుకుంటే రకరకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.