Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తమలపాకు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నిపుణులు. భారతీయ సంస్కృతిలో తమలపాకు వినియోగం ఎక్కువే. పూజలు, శుభకార్యాలలోనే కాకుండా వీటిని రోజూతీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తమలపాకును తినడం కొంతవరకూ ఆరోగ్యమే. కానీ ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన అనారోగ్యం బారిన పడడం ఖాయం అని వారు చెబుతున్నారు. మహిళలు తమలపాకును తొడిమతో సహా తీసుకునే మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ ఐదు నుంచి పది ఆకులు తీసుకుంటే డ్రగ్స్‌లాగా  అలవాటేయ్యే ప్రమాదం ఉందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అదే విధంగా అధికరక్తపోటుతో బాధపడేవారు తమలపాకుకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తమలపాకును పొగాకుతో కలిపి తీసుకుంటే ప్రాణాంతకమైన నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా తమలపాకును మితంగా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.