Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో, అదే విధంగా హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సమాజ సేవలో భాగమవుతూ విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన డాక్టర్ ఆనంద్ కుమార్,డాక్టర్ పూర్నిమల సేవలను గుర్తించి వారికి జాతీయ అవార్డులు అందజేశారు. ఈ మేరకు డాక్టర్ ఆనంద్‌కి ప్రముఖ అమెరికా సంస్థ ప్యూర్ విశిష్ట ఐర్యా అవార్డ్, డాక్టర్ పూర్నిమకు జాతీయ సశక్తి నారీ సమ్మాన్ అవార్డ్ ఇచ్చారు. బంజారా మహిళా ఎన్జీవో ద్వారా ఇప్పటి వరకు అనేక ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన శిబిరాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ ఆనంద్, పూర్ణిమ దంపతులు.

మారుమూల గ్రామాలలోని పేద వారు, వెనుక బడిన వారు, ముఖ్యంగా స్త్రీలు ,పిల్లల కోసం వారు అందించిన సహకారానికి గాను ఈ పురస్కారాలు లభించాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ప్యూర్ సి.ఇ.ఓ శైలా తాల్లూరి సింగర్ కౌసల్య చేతుల మీదుగా డాక్టర్ ఆనంద్ హైదరాబాద్‌లో అవార్డు స్వీకరించగా, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి శశికళ చేతుల మీదుగా డాక్తర్ పూర్ణిమ ఢిల్లీలో ఈ అవార్డ్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ ,డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ తమకు సహాయ సహకారాలు అందించిన సంస్థలకు,మిత్రులకు ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు తెలియజేస్తూ.. ఈ అవార్డ్‌లను దేశం లోని ప్రతి ఒక్క మహిళకు అంకితమిస్తున్నట్లు వారు తెలిపారు. మహిళా సాధికారత వంటి ఇతివ్రుత్తాలతో డాక్టర్ ఆనంద్ డైరెక్టర్‌గా ‘‘ప్రజా హక్కు, అంటురానితనం, చిరు తేజ్ సింగ్’’ వంటి లఘు చిత్రాలు రూపొందించిన విషయం తెలిసిందే.