Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అమెరికా-చైనా ట్రేడ్‌చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ సానుకూలంగా ఉన్నాయి. దీంతో దేశీయంగా కూడా రెండు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ కీలక సూచీలు లాభాలతో ఎగిసిపడుతున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత పుంజుకుని డబుల్‌ సెంచరీ లాభాలను సాధించాయి. సెన్సెక్స్‌ 215 పాయింట్ల లాభంతో 36364 వద్ద, నిఫ్టీ 40పాయింట్ల లాభంతో 10900స్థాయికి సమీపంలో కొనసాగుతున్నాయి. బాటా, సన్‌ఫార్మ,ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, అదానీపోర్ట్స్‌, ఎస్‌బ్యాంకు, కోల్‌ ఇండియా లాభపడుతున్నాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌; బీపీసీఎల్‌, హీరో మోటో, ఎంఅండ్‌ ఎం యాక్సిక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ నష్టపోతున్నాయి.

అటు డాలరు మారకంలో రుపీ లాభాలతో ప్రారంభమైంది. మంగళవారం నాటి ముగింపు 70.70తో పోలిస్తే.. 70.48 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.