Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో పెను సంచలనాలకు దారి తీసింది. ఇప్పుడు జియో వినియోగదారులకు మరో శుభవార్తను ప్రకటించింది. రిలయన్స్ జియో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 10జీబీ 4జీ డేటాను వినియోగదారులకు ఉచితంగా అందించనుంది. అయితే ఈ 10 జీబీ డేటాను కేవలం 5 రోజుల పాటు మాత్రమే అందిస్తుంది. అంటే రోజుకు సగటున 2 జీబీని వినియోగదారులు వాడుకోవాల్సి ఉంటుంది.

రోజు 2 జీబీ డేటా ఖాళీ అయిన తర్వాత మీ ప్లాన్‌లో ఉన్న డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ డేటా కస్టమర్ల జియో అకౌంట్‌లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. గతంలో కూడా సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో సదుపాయాలను కల్పించనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది.