Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గుజరాత్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమనేత జిగ్నేశ్ మేవానీ ఇవాళ పాల్గొనాల్సిన ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ‘యువ హంకర్ ర్యాలీ’కి అనుమతి రద్దుపై దేశ రాజధానిలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున యువకులు పార్లమెంటు వీధుల్లో చేరి జిగ్నేశ్ మేవానీకి మద్దతుగా ఆందోళన చేపట్టారు.
కాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆందోళన చేపట్టరాదనీ… అందుకే అక్కడ ఆందోళనకు అనుమతి ఇవ్వలేదని న్యూఢిల్లీ జాయింట్ సీపీ అజయ్ చౌదరి వెల్లడించారు. రామ్‌లీలా మైదాన్ వంటి ప్రత్యామ్నాయ వేదికల వద్ద ధర్నా నిర్వహించుకోవాలని నిర్వాహకులను కోరామన్నారు. మరోవైపు మేవానీకి వ్యతిరేకంగా కూడా ఢిల్లీ వ్యాప్తంగా పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. దళితులను రెచ్చగొట్టే విధంగా మేవానీ ప్రసంగాలు చేస్తున్నారంటూ సదరు పోస్టర్లలలో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్లకు బాధ్యత వహిస్తూ ఎలాంటి పేర్లు లేకపోవడం గమనార్హం.