Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చికాగో: చికాగోలో శని, ఆదివారాల్లో జరిగిన కాల్పుల్లో 5 మంది మరణించగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయాలైన వాళ్లలో మూడేళ్ల బాలుడు ఉండటం బాధాకరం. చికాగోలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే 1800 వందల మందిపై కాల్పులు జరిగాయి. అధికారులందరూ చికాగోను వార్ జోన్‌గా వర్ణించారు. అమెరికాలోని పత్రికలు తెలియజేసిన దాని ప్రకారం శుక్రవారం 18 మందిపై, శనివారం 23 మందిపై, ఆదివారం 21 మందిపై కాల్పులు జరిగాయి. పిల్లల పాఠశాలలు మళ్లీ ప్రారంభం కావడంతో ‘పీస్ పిక్నిక్’ అనే చిన్న ఈవెంట్‌ను నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న సెవార్డ్ పార్క్‌లో నిర్వహిస్తుండగా అక్కడ కాల్పులు జరిపారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలపై కూడా కాల్పులు జరిపారు. తాము ఆనందంగా ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా తెలియని వ్యక్తులు మత్తులో అక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించారని ఈవెంట్ ఆర్గనైజర్ రేమండ్ హాచర్ తెలిపారు. ఇటువంటివి ఇకపై జరగకుండా చూడాలని రేమండ్ హాచర్ కోరారు. చికాగోలో ఈ పరిస్థితి ఏర్పడడానికి ఆ సిటీ మేయర్ రాం ఇమ్మానుయేలే కారణమని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆయన అవినీతి పరుడని, ఉద్యోగాలు కల్పించే విషయంలోనూ విఫలమయ్యారని ట్రంప్ చెప్పారు.