Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గ్రీన్‌ టీ తాగితే బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బులు దరిచేరవు. శరీరంలోని చక్కెరస్థాయులు కూడా అదుపులో ఉంటాయి. అలాగే, కేన్సర్‌ కణాల వృద్ధిని నియంత్రించడంలోనూ గ్రీన్‌ టీ కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా యూకేలోని సాల్ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రీన్‌ టీ ఆకుల్లోని సారం మైటోకాండ్రియా జీవక్రియను నియంత్రిస్తుందని తెలిపారు. ఈ మేరకు సైంటిఫిక్‌ జర్నల్‌ ఏజింగ్‌లో ఒక కథనం ప్రచురితమైంది. కొద్దిగా గ్రీన్‌ టీ తాగినా.. కేన్సర్‌ కణాలు నిద్రాణ వ్యవస్థలోకి వెళ్తాయని పరిశోధనలో గుర్తించామన్నారు