Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గూగుల్ మ్యాప్స్ నుంచి అద్భుతమైన ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు చిరునామాలను సులభంగా తెలుసుకునేందుకు ఉపయోగపడిన మ్యాప్స్‌లో ఇప్పుడు మరో అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ వచ్చేసింది. మ్యాప్స్ ద్వారా ఇకపై ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకోవడం, రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకోవడం వంటి ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు ఫోన్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. బిజినెస్ ప్రొఫైల్ వద్ద ఉండే మెసేజ్ ఆప్షన్ ద్వారా చాట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, చాట్ చేయాలనుకున్న సంస్థ రిజిస్టర్ అయి ఉంటేనే ఈ ఆప్షన్ కనిపిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది.